ఢిల్లీ – మితవాదగ్రూప్ లు దాడి చేయవచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం వద్ద డిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. స్థానిక పోలీసులతో పాటు ఒక ప్లాటూన్ పారామిలిటరీ బలగాలను ఆయన నివాసం చుట్టూ మోహరించారు. లోక్‌సభలో సోమవారం ప్రసంగించిన రాహుల్‌గాంధీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ పార్టీ శ్రేణులు రాహుల్ నివాసం వద్ద ఆందోళనకు దిగే ప్రమాదం ఉందన్న సమాచారం మేరకు భద్రతను పెంచారు. రాహుల్ నివాసం చుట్టూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులకు సూచించారు. జెడ్ ప్లస్ భద్రత కలిగిన రాహుల్‌కు సీఆర్పీఎఫ్ బృందాలు భద్రత కల్పిస్తున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది లేకుండా ప్రజల మధ్యకు వెళ్లవద్దని ఆయన భద్రతాసిబ్బంది రాహుల్ ను కోరారు..
Delhi – రాహుల్ గాంధీ ఇంటి వద్ద హై సెక్యూరిటీ .. నిఘా వర్గాల హెచ్చరికతో స్పందించిన కేంద్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement