Friday, November 22, 2024

Delhi: స‌రోగ‌సిపై ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ..

భారత్‌లో సరోగసిపై ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.. స‌రోగ‌సిని మ‌న దేశంలో ఎట్టి ప్రోత్సహించకూడదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీన్ని ఇలాగే వదిలేస్తే బిలియన్‌ డాలర్ల వ్యాపారంగా ఎదగవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. వివ‌రాల‌లోకి వెళితే సరోగసీ (రెగ్యులేషన్) చట్టాన్ని సవరిస్తూ కేంద్రం మార్చి 14న జారీ చేసిన నోటిఫికేషన్‌ను భారతీయ సంతతకి చెందిన కెనడా దంపతులు ఢిల్లీ కోర్టులో సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

కోర్టు ఆదేశాల మేరకే సరోగసీ నిబంధనలను మార్చినట్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మినీ పుష్కరణ్‌ ధర్మాసనం తెలిపింది. ‘ఇందులో ఇప్పుడు కోర్టు ఎందుకు జోక్యం చేసుకోవాలి. ఈ పరిశ్రమను (సరోగసీ)ని ప్రోత్సహించాల్సిర అవసరం లేదు. మీరు కెనడాలో ఉంటున్నారు. ఇక్కడ పరిశ్రమను నడుపలేరు. ఇది 2.3 బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా మారుతుంది. మేం ఏదైనా చేయమని ప్రభుత్వాన్ని అడగాల్సిన సందర్భం ఇది కాదు’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, హిందూ ఆచారాల ప్రకారం చట్టబద్ధంగా వివాహం చేసుకున్న వారు భారతీయ పౌరులని, దేశంలో శాశ్వత నివాసితులని పిటిషనర్లు తెలిపారు. తాము సంతానం లేని దంపతులమని, వారికి గర్భిణీ సరోగసీ ద్వారా తల్లిదండ్రులు కావాలని వారు కోరుకుంటున్నారని.. ఇందుకు సరోగసీ విధానం అవసరమవుతుందని పిటిషన్లు పేర్కొన్నారు. 2022 డిసెంబర్‌లో దంపతులకు డోనర్ ఓసైట్‌తో సరోగసీ కోసం మెడికల్ ఇండికేషన్ సర్టిఫికేట్ మంజూరు చేశార‌ని.. వారు అధునాతన చికిత్సగా సరోగసీ విధానాన్ని చేయించుకోవచ్చని కోర్టు పేర్కొంది. అయితే, ఈ ఏడాది మార్చి 14న సరోగసీ నిబంధనలను సవరిస్తూ.. దాతల సరోగసీని నిషేధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పిటిష‌న‌ర్ల‌కు ఆ స‌వ‌ర‌ణ వ‌ర్తించ‌ద‌ని కోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement