Friday, November 22, 2024

Delhi | వాలంటీర్ల పత్రిక కొనుగోలు కేసులో ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికల కొనుగోలుకు వాలంటీర్లకు నెలకు రెండు వందలు ఇచ్చే విధానంపై పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వాలంటీర్ల పత్రిక కొనుగోలు కేసులో సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వాలంటీర్లకు పేపర్ కొనుగోలు కోసం నెలకు 200 రూపాయలు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉషోదయ పబ్లికేషన్స్ (ఈనాడు) సవాల్ చేసిన విషయం తెలిసిందే. 200 రూపాయలతో సాక్షి పత్రిక మాత్రమే కొంటున్నారని ఆరోపణ ఉషోదయ పబ్లికేషన్స్ ఆరోపించింది. ఏపీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుకు కేసును బదిలీ చేసింది. దీంతో ఇవాళ విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement