Tuesday, November 26, 2024

చిన్నారుల‌పై కొవాగ్జిన్ ప్రయోగాల విషయంలో స్టేకు హైకోర్టు నిరాక‌ర‌ణ

దేశంలో కరోనా థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో కొవాగ్జిన్ టీకాలను 2-18 సంవ‌త్స‌రాల పిల్ల‌ల‌పై ప్ర‌యోగించేందుకు డీసీజీఐ అనుమ‌తించింది. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేసుకోవ‌చ్చ‌ని, అయితే ఫ‌స్ట్ ఫేజ్ డేటా ఇచ్చిన త‌ర్వాత సెకండ్ ఫేజ్, ఆ డేటా ఇచ్చిన త‌ర్వాతే థ‌ర్డ్ ఫేజ్ ట్ర‌య‌ల్స్ చేయాల‌ని షరతు విధించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఫస్ట్ ఫేజ్ సేఫ్ అని తెలిసిన త‌ర్వాత సెకండ్, థ‌ర్డ్ ఫేజ్ ట్ర‌య‌ల్స్ ను నేరుగా చేస్తున్నారు. అయితే చిన్నారుల‌పై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిలిపివేయాల‌ని సంజీవ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్‌ దాఖలు చేశాడు. ట్రయల్స్‌లో పాల్గొనాల్సిన పిల్లలు తమకు తాము వాలంటీర్లుగా రిజిస్టర్‌ చేసుకుంటున్నారని ఆయ‌న‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిల్లలకు వ్యాక్సిన్ ప్రయోగాల వల్ల తలెత్తే పరిణామాలపై అవగాహన ఉండదని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. దీనిని విచారించిన న్యాయ‌స్థానం స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రం, డీసీజీఐ, భారత్ బయోటెక్‌కు నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement