ఢిల్లీని భారీ వర్షాలు అతలా కుతలం చేస్తున్నాయి. శుక్రవారం నగరంలోని చాలా చోట్ల మోస్తరు వర్షం పడుతుందని ప్రజలను హెచ్చరించింది. భారత వాతావరణ శాఖ (IMD) ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ఢిల్లీలో ఈ వీకెండ్ లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల దృష్ట్యా, శుక్రవారం నోయిడా, గురుగ్రామ్‌లలో ప్రైవేట్ పాఠశాలలను (8వ తరగతి వరకు) మూసివేశారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో సుదీర్ఘ ట్రాఫిక్ కష్టాలలు మొదలయ్యాయి. ఆ ప్రాంతంలో మరింత వర్షం కురిసే అవకాశం ఉంది. చాలా చోట్ల సాధారణంగా ఆకాశం మేఘావృతమై మోస్తరు ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది.
గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీల సెల్సియస్, 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ వైపు తాజా మేఘం చేరుకుంటోంది. దీని వల్ల వచ్చే 3-4 గంటల్లో ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాలలో అప్పుడప్పుడు తీవ్రమైన స్పెల్‌లతో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ’’ అని వాతావరణ శాఖ ఒక ట్వీట్‌లో తెలిపింది. శుక్రవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గురుగ్రామ్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇఫ్కో చౌక్, శంకర్ చౌక్, రాజీవ్ చౌక్, గుర్ గావ్ – ఢిల్లీ సరిహద్దు సమీపంలోని సర్హౌల్‌తో సహా, నేషనల్ హైవే (NH) 48లోని అనేక మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాల కారణంగా రోడ్లు నీట మునగడంతో పాదచారులు నడిచేందుకు కూడా ఇబ్బంది పడ్డారు.