Friday, November 22, 2024

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేస్తూ కేజ్రీవాల్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. విస్తృతంగా వ్యాపించే లక్షణం ఉన్న కొత్త కరోనా వేరియంట్‌ను ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో కనుగొన్నారని.. ఆ వేరియంట్‌ ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ చాలా తక్కువగా, వ్యాప్తి వేగం, ఇన్ఫెక్షన్‌ వేగం ఎక్కువగా ఉన్నాయని, అందుకే ముందు జాగ్రత్తచర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది ప్రభుత్వం. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నవారు లేదా ఢిల్లీ చేరుకునే సమయానికి ముందు(72 గంటల్లోపు) ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకుని, నెగెటివ్‌ సర్టిఫికెట్‌తో వచ్చేవారు ఏడు రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement