ఢిల్లీలో ఈ తెల్లవారుజామునా అగ్నిప్రమాదం సంభవించింది. తూర్పు ఢిల్లీ లోని కృష్ణ నగర్ ప్రాంతంలో అంతస్తుల భవనంలో మంటలు పెద్దఎత్తున చెలరేగాయి. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందగా, మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈ సమయంలో ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ కు ఫోన్‌కాల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ సర్వీస్ లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు.
అగ్నిమాపక సిబ్బంది ప్రకారం…. ఈ ఘటనలో మొత్తం 12 మందిని రక్షించామని తెలిపారు. కాకపోతే ఈ ప్రమాదంలో ద్రువదృష్టశాత్తు ముగ్గురు మరణించినట్లు ప్రకటించారు. వారిలో ఇద్దరిని అంజు శర్మ, కేశవ్ శర్మగా గుర్తించారు అధికారులు. ఇంకో మహిళ మృతదేహం భవనం మొదటి అంతస్తులో కనుగొన్నారు అధికారులు. ఆమెను 66 ఏళ్లు కలిగిన పర్మిలా షాద్ గా అధికారులు వివరాలు తెలిపారు. రిపోర్ట్ ప్రకారం, ఆ భవనంలోని పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగినట్లు అనుమనం వ్యక్తం చేస్తున్నారు. ఇకపొహతే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటన వల్ల ఆ స్థలంలో ఉన్న 11 వాహనాలు బూడిదయ్యాయి.