ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు షాక్ ఇచ్చింది. ఏకంగా 20 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ రూస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది.
ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్, కవితల కస్టడీ ఈరోజు (ఆగస్టు 13)తో ముగియడంతో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇద్దరినీ రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కాగా, అధికారుల వాదనలు విన్న న్యాయస్థానం వారిద్దరికీ మరో 20 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. సెప్టెంబర్ 2న కోర్టుకు హాజరుకావాలని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా తీర్పు చెప్పారు.