ఆంధ్రప్రభ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్లో శనివారం నాడు నీతి ఆయోగ్ సమావేశాన్ని కేంద్రం నిర్వహించింది. దీనికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. దీనిలో పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలే ఈ భేటీ ప్రధాన అంజెండా చర్చలు జరిపారు.. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ భేటిలో పాల్గొన్నారు.
కాగా, . విపక్ష పార్టీలకు చెందిన పలువురు సీఎంలు దీనిని బాయ్‌కాట్ చేయగాపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత మాత్రం హాజరయ్యారు. మరోవైపు ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన జేడీయూ అగ్రనేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. తనకు బదులుగా డిప్యూటీలను పంపారు. అయితే ఆయన గైర్హాజరుకు గల కారణం మాత్రం తెలియరాలేదు.
దీదీ వాకౌట్
సభకు హాజరైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపు గురించి మాట్లాడటం ప్రారంభించగానే తన మైక్ ఆఫ్ చేశారని ఆరోపిస్తూ ఆమె సమావేశం నుంచి బయటకు వచ్చారు. ”కేంద్ర బడ్జెట్లో పశ్చిమబెంగాల్‌పై వివక్ష చూపారని, రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ మాట్లాడటం ప్రారంభించగానే వారు నా మైక్ ఆపేశారు. నేను మాట్లాడకుండా అడ్డుకున్నారు. ఎందుకు వివక్ష చూపుతున్నారని నేను ప్రశ్నించాను. విపక్షాల నుంచి హాజరైంది నేను ఒక్కదాన్నే. నన్నొక్కదాన్ని కూడా వారు ఆపారు. మిగతా సభ్యుల మాదిరిగానే మాట్లాడేందుకు నాకు తగిన సమయం ఇవ్వకపోవడం అవమానించడమే” అని మమత ఆరోపించారు. ఈ చర్య అన్ని ప్రాంతీయ పార్టీలను అవమానించడం కిందికే వస్తుందని విమర్శించారు. భవిష్యత్తులో ఇంకెప్పుడూ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానని అన్నారు.
బిజెపి కౌంటర్ …
ఆమె ఆరోపణలపై భాజపా స్పందించింది. విపక్షాలకు చెందిన కొందరు బాయ్‌కాట్ చేసేందుకు నీతి ఆయోగ్‌ను ఒక వేదికగా మార్చుకున్నారని అన్నారు.
రేవంత్ సహా పలువురు సిఎంలు బాయ్ కాట్
ఈ సమావేశానికి విపక్ష ఇండియా కూటమి పార్టీలకు చెందిన నేతలు పలువురు గైర్హాజరయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వివక్ష చూపారంటూ నిరసిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ, పంజాబ్, కర్ణాటక హిమాచల్ ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు