ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 41.8 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. దుబాయ్‌కు వెళ్తున్న భారతీయ ప్రయాణికుడి నుండి ఈ విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆ ప్రయాణికుడు గురువారం IX-141 విమానంలో న్యూఢిల్లీ నుండి దుబాయ్ వెళ్లాలని అనుకున్నాడు. కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో తనిఖీ చేశారు. అతనితో పాటు లగేజీని తనిఖీలు చే చేయడంతో నిందితుడి బ్యాగ్‌లలో ఒకదాని నుండి విదేశీ నోట్లు బయటపడ్డాయి. కస్టమ్స్ యాక్ట్ 1962లోని సెక్షన్ 110 కింద మొత్తం 52,900డాలర్లు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అదే చట్టంలోని సెక్షన్ 104 కింద నిందితుడిని అరెస్టు చేసినట్టు చెప్పారు.
కస్టమ్స్ చెకింగ్.. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న వ్యక్తి వద్ద విదేశీ కరెన్సీ స్వాధీనం
Advertisement
తాజా వార్తలు
Advertisement