ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. జూన్ రెండో తేదీన సరెండర్ కానున్నట్లు చెప్పారు. కేజ్రీవాల్ ఇవాళ ఓ వీడియో రిలీజ్చేశారు. అందులో మళ్లీ తీహార్ జైలుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్‌తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో కేజ్రీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ తరపున ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంలో పిటీషన్ పెట్టుకున్నారు. ఆయనకు 21 రోజుల తాత్కాలిక బెయిల్‌ను సుప్రీం జారీ చేసింది. ఆ బెయిల్ గడువు జూన్ ఒకటో తేదీతో ముగియనున్నది.
బెయిల్‌ను పొడిగించాలని కేజ్రీ పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్వీకరించలేదు. దీంతో కేజ్రీ దారులు మూసుకుపోయాయి. దేశాన్ని నియంతృత్వం నుంచి రక్షించేందుకు మళ్లీ జైలుకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. మళ్లీ జైలుకు వెళ్తే తనను ఎన్ని రోజులు బంధిస్తారో తెలియదన్నారు. జైలులో ఉన్నప్పుడు తనను ఎన్నో విధాలుగా వేధించినట్లు ఆరోపించారు. తనకు మెడిసిన్ ఇవ్వడం ఆపేశారన్నారు. జైలుకు వెళ్లేముందు తన బరువు 70 కేజీలు అని, ఇప్పుడు 64 కేజీలకు చేరుకున్నట్లు వెల్లడించాడు. జైలు నుంచి రిలీజైన తర్వాత కూడా ఇంకా బరువు పెరగలేదన్నాడు. తమ సర్కారు అమలు చేస్తున్న అన్ని స్కీమ్‌లు యధాతథంగా ఉంటాయని, మళ్లీ వచ్చిన తర్వాత ప్రతి మహిళకు వెయ్యి ఇస్తానన్నారు.