ఢిల్లీ పటాకులు పేల్చడంపై ఆ రాష్ట్ర సీఎం మరోసారి సీరియస్ అయ్యారు. ఈ ఏడాది కూడా దీపావళి వేళ బాణాసంచా పేల్చరాదనని సీఎం కేజ్రీవాల్ వార్నింగ్ ఇచ్చారు. తన ట్విట్టర్‌లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీలో పటాకులను నిల్వ చేయడం, అమ్మడం, వాడడం చేయకూడదని ఆయన తన ట్వీట్‌లో చెప్పారు. గత ఏడాది కూడా బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది. గత మూడేళ్ల నుంచి ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. క్రాకర్స్‌పై నిషేధం వల్ల కొన్ని జీవితాలను కాపాడవచ్చు అని సీఎం కేజ్రీ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement