ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరగా..సీఎం కేజ్రీవాల్ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈడీ స్వాధీనం చేసుకున్న సీఎం ఫోన్ పాస్ వర్డ్ లను ఆయన చెప్పడం లేదని.. అందులో కీలకమైన సమాచారం ఉందని.. ఆ ఫోన్లను ఫారెన్సీక్ కు పంపినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. ఆ రిపోర్ట్ ఆధారాలు చాలా కీలకమని వారు అభిప్రాయపడ్డారు. కాగా ఈ రోజు ఉదయం.. లిక్కర్ స్కాం కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న కస్టడీలో ఉన్న ఆయన సీఎం పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది.
ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించే అంశం తమ పరిధిలోకి రాదని.. ఇది పూర్తిగా రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొన్ని గంటలకే.. కస్టడీ పొడిగిస్తూ.. కేజ్రీవాల్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది.