దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి రావడంతో లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపునకు కేజ్రీవాల్ సర్కారు సిద్ధమయ్యింది. ఢిల్లీలో రోజువారి కేసులు 400 కన్నా తక్కువే వచ్చాయని, పాజిటివిటీ రేటు 0.5 శాతంగా ఉందని ఆయన చెప్పారు. దీంతో లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తేస్తున్నామన్నారు. సోమవారం నుంచి షాపింగ్ మాళ్లు, మార్కెట్లను సరి–బేసి విధానంలో తెరుచుకోవచ్చని చెప్పారు. ఉదయం పదింటి నుంచి సాయంత్రం 8 గంటలకు షాపులను తెరవొచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆఫీసుల్లో గ్రూప్ ఏ ఆఫీసర్లు వంద శాతం విధులకు హాజరు కావాలన్నారు. ఆ లోపు గ్రేడ్ ఉద్యోగులు 50 శాతం మంది విధులకు రావాల్సి ఉంటుందని చెప్పారు.
అత్యవసర సేవల్లో ఉన్న వారు మాత్రం వంద శాతం డ్యూటీలకు రావాల్సి ఉంటుందన్నారు. ప్రైవేటు ఆఫీసులను 50 శాతం సిబ్బందితో నడుపుకోవచ్చని చెప్పారు. అయితే, వీలైనంత వరకు ఇంటి నుంచే పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని సూచించారు. 50 శాతం సామర్థ్యంతో ఢిల్లీ మెట్రో నడుస్తుందన్నారు. ఈ కామర్స్ సేవలనూ ప్రారంభించుకోవచ్చని చెప్పారు. మరిన్ని సడలింపులను రాబోయే రోజుల్లో ప్రకటిస్తామన్నారు.
సరి–బేసి విధానంలో షాపింగ్ మాళ్లు, మార్కెట్లు ఓపెన్: అరవింద్ కేజ్రీవాల్
Advertisement
తాజా వార్తలు
Advertisement