ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ నోటీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందించిన నోటీసులపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. రాజకీయ ప్రేరేపితంతోనే తనకు నోటీసులు జారీ చేశారని కేజ్రీవాల్ అన్నారు.
నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకే నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే ఈడీ నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మద్యం కుంభకోణం కేసులో భాగంగా కేజ్రవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ మేరకు ఆయన ఇవాళ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉంది.