ఢిల్లీ సీఎం అతిషి మీడియా సమావేశంలో కంటతడి పెట్టుకున్నారు. ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో… బీజేపీ నేత రమేష్ బిదూరి ఎన్నికల ర్యాలీలో అతిషి ఇంటి పేరుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ ఆమే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దేశంలో రాజకీయాలు దిగజారిపోయాయని అన్నారు.
ఈ సందర్భంగా అతిషి మాట్లాడుతూ.. ” రమేష్ బిదూరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా నాన్న జీవితాంతం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వేలాది మంది పిల్లలకు బోధించారు. ఇప్పుడు ఆయనకి 80 ఏళ్లు.. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతను మరొకరి సహాయం లేకుండా నడవలేడు. ఎన్నికల కోసం ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడతారా..? పెద్దాయనను అవమానించే స్థాయికి చేరుకున్నారు. దేశంలో రాజకీయాలు ఇలా దిగజారిపోతాయని నేనెప్పుడూ అనుకోలేదు’’ అని అతిషి అన్నారు.