నామ మాత్ర మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 15 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 ,,వికెట్లు నష్టపోయి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.లివింగ్‌స్టోన్(94 : 48 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. సిక్స్‌లతో విరుచుకుడపడిన అతను ఆఖరి దాకా పోరాడాడు. కానీ, ఇషాంత్ శర్మ వేసిన 20వ ఓవర్లో లివింగ్‌స్టోన్(94) రెండో బంతికి సిక్స్, రెండో బంతికి ఫోర్, మూడో బంతికి సిక్స్ బాదాడు. ఫ్రీ హిట్‌కు రన్ రాలేదు. ఐదో బాల్‌కు పరుగు రాలేదు. ఆఖరి బంతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో, ఢిల్లీ 15 పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. . .
214 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కీలక మ్యాచ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్(0) డకౌటయ్యాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(22) ఆ తర్వాత అథర్వ తైడే(54) రిటైర్డ్ హర్ట్‌గా లివింగ్‌స్టోన్(52) హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ నిలబెట్టారు. షారుక్ ఖాన్(6), జితేశ్ శర్మ(0) ఇలా వచ్చి అలా వెళ్లారు. అన్రిచ్ నార్జ్ 19వ ఓవర్లో సామ్ కరన్(11)ను బౌల్డ్ చేశాడు. హర్‌ప్రీత్ బ్రార్(0)ను రనౌట్ చేశాడు. దాంతో, పంజాబ్ ఏడు వికెట్లు కోల్పోయింది.. తిరిగి బ్యాటింగ్ వచ్చిన లివింగ్‌స్టోన్ 94 పరుగులు చేసి 8 వికెట్ గా వెనుతిరిగాడు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నార్జ్, ఇషాంత్ శర్మ రెండేసి వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు.
ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చెలరేగింది. పంజాబ్ కింగ్స్ సొంత గ్రౌండ్ ధర్మశాలలో రిలే రస్సో(82 నాటౌట్ : 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), ఓపెనర్ పృథ్వీ షా(54) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. ఫామ్‌లో ఉన్న ఫిలిఫ్ సాల్ట్(26 నాటౌట్ : 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు ) ధనాధన్ ఆడడంతో వార్నర్ సేన 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది..
హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 20 ఓవర్లో రిలే రస్సో(82 నాటౌట్) తొలి రెండు బంతుల్ని సిక్స్, ఫోర్‌గా మలిచాడు. దాంతో, ఢిల్లీ స్కోర్ 200 దాటింది. మూడో బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. ఆఖరి బంతికి ఫిలిఫ్ సాల్ట్(26 నాటౌట్) ఫోర్ కొట్టాడు. దాంతో, ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.టాస్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (46), పృథ్వీ షా(54) శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 94 రన్స్ జోడించారు. ఆ తర్వాత వచ్చిన రస్సో, సాల్ట్ దంచికొట్టాడు. దాంతో వార్నర్ సేన పరుగులు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ రెండు వికెట్లు తీశాడు