ఐపీఎల్ 14వ సీజన్‌లో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు కరోనా భారిన పడి కొన్ని మ్యాచులకు దూరమయ్యారు. ఇపుడు రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న తమ రెండో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తలిలింది. ఢిల్లీ ప్రధాన పేసర్ అన్రిచ్ నోర్ట్జేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. బీసీసీఐ ఎస్‌ఓపీ ప్రకారం..పాజిటివ్‌గా తేలిన వ్యక్తి బయో సెక్యూర్ బబుల్ బయట 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. సీజన్ ఆరంభానికి ముందే క్యాపిటల్స్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ కోసం నోర్ట్జేతో కలిసి ఇతర సౌతాఫ్రికా ఆటగాళ్లు రబాడ, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, క్వింటన్ డికాక్ భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న డికాక్ ఏడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకొని కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ కూడా ఆడాడు. రబాడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement