Saturday, November 23, 2024

Delhi | ప్రతిభకు పట్టం.. ఢిల్లీలో డాక్టరేట్ అందుకున్న తెలుగువారు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధానిలో తెలుగు వారి  ప్రతిభకు గౌరవం దక్కింది. మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఫరీదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలువురు ప్రతిభావంతులకు డాక్టరేట్ ప్రదానం చేశారు. సి.హెచ్.వి.ఎస్. చారి (ఉపాధ్యాయుడు, ఆస్ట్రాలజిస్ట్), కోటి శశిశ్రీ (మ్యూజిక్ టీచర్), ఇరవ సూరమ్మ(టీచర్), బెహరా ప్రవీణ్ కుమార్(అడ్మినిస్ట్రేటర్), కట్టి ప్రసాదరావు (ఆస్ట్రాలజిస్ట్), సి.హెచ్.ఆర్.చక్రధర్ (విద్యా శాఖ), బి.ఎన్.కృష్ణవేణి (టీచర్) తదితరులు డాక్టరేట్ పొందారు.

సామాజికవేత్త, బుల్లితెర ఉత్తమ చిత్ర దర్శక అవార్డు గ్రహీత డా.గణగళ్ల విజయ్ కుమార్, బాలీవుడ్ దర్శకులు మనోజ్ కుమార్ భాటియా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు వారు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మెజీషియన్ సి.పి యాదవ్ మాట్లాడుతూ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా ప్రముఖ వ్యక్తులను గుర్తించి డాక్టరేట్ ఇవ్వడం సంతోషకరమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement