ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపికైనట్లు బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో, సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ అవకాశం దక్కించుకుంది. కాగా దక్షిణ భారత దేశం నుంచి ఏపీతో పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. వివిధ రాష్ట్రాల నుంచి రిపబ్లిక్ డే పరేడు శకటాలను కేంద్రం ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 71వ గణతంత్ర వేడుకల్లో కూడా ఏపీ శకటం ఎంతగానో ఆకట్టుకుంది. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా రూపొందించారు. ఆకర్షణీయంగా రూపొందించిన ప్రగతిరథం రాజ్‌పథ్‌లో కనువిందు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం, బ్రహ్మోత్సవాలు, కూచిపూడి నృత్యాలు, ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు, సహజరంగుల కలంకారీ అద్దకాలతో కూడిన ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement