అగ్నిపథ్ వ్యతిరేక ఉద్యమం పేరిట సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన హింస వెనుక ఖచ్చితంగా కుట్ర ఉందని ఆరోపించారు తెలంగాణ బిజెపి మహిళా నేత విజయశాంతి.. అందుకు ఎన్నో ఆధారాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ ఆందోళన కోసం పెద్ద సంఖ్యలో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి, ముందస్తు ప్రణాళికతో విధ్వంసం దిశగా అడుగులు పడినట్టు తెలుస్తోందన్నారు. అగ్నిపథ్ అనేది 17 ఏళ్ల నుంచి 21 ఏళ్ల లోపు యువకుల కోసం కాగా, నిన్నటి హింసాకాండలో ఆర్మీ వయోపరిమితితో సంబంధంలేని రీతిలో 30 ఏళ్ల వారు పాల్గొన్నారని విజయశాంతి వెల్లడించారు. కేంద్రం ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వకపోయినా ఇంత హింస సృష్టించారంటే ఇది కచ్చితంగా ఆర్మీ ఆశావహుల పనికాదన్న విషయం స్పష్టమవుతోందని వివరించారు. ఇది తప్పకుండా బీజేపీ వ్యతిరేకులు కుట్రపన్ని చేయించిన పనే అని ఆరోపించారు. నిజాలు త్వరలోనే బయటికి వస్తాయని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement