Monday, November 25, 2024

ఢిల్లీలో లోపించిన వాయు నాణ్య‌త‌… పీల్చుకునే గాలీ కలుషిత‌మే..!

దేశంలో వాయు కాలుష్యం పెరుగుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిస్తుంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో రోజ‌రోజుకు వాయు కాలుష్యం పెరుగుతుండడంతో గాలిలో నాణ్య‌త త‌గ్గుతుంది. దీంతో అధికారులు దీపావ‌ళి పండుగ నాడు ట‌పాసులు కాల్చాల‌ని ప్ర‌భుత్వం నిషేధం విధించింది. ప్ర‌భుత్వం నిబంధ‌న‌లు విధించిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు లెక్క‌చేయ‌కుండా ట‌పాసులు కాల్చి పండుగ‌ను జ‌రుపుకున్నారు. దీంతో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో వాయు నాణ్యత దారుణంగా పడిపోతున్నది. శనివారం ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ 309గా నమోదైంది. నగరంలో మథురా రోడ్డు, బారఖాంబా రోడ్డు, ప్రగతి మైదాన్‌ వద్ద కాలుష్యం అత్యంత తీవ్రంగా ఉన్నది. కాలుష్యం పెరిగిపోవడంతో కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుందని ప‌లువురు కార్మికులు తెలిపారు. గాలిలో మార్పును మన కళ్లలో కూడా చూడవచ్చని చెప్పారు. అయినా ఇంట్లోనుంచి బయటికి వెళ్లక తప్పదన్నారు. గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement