భారత నౌకాదళం సముద్ర సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇందులో భాగంగా యుద్ధనౌక తయారీ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జిఆర్‌ఎస్‌ఇ) నిర్మించిన రెండవ పి17ఎ స్టెల్త్ ఫ్రిగేట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జూలై 15న ప్రారంభించనున్నారు. లేటెస్ట్ ఎక్విప్మెంట్, గాడ్జెట్‌లని ఈ షిప్లో అమర్చినట్టు ఓ అధికారి తెలిపారు. ప్రాజెక్ట్ 17A కింద మూడు స్టెల్త్ ఫ్రిగేట్‌లను నిర్మించడానికి జీఆర్ఎస్ఈ ఒప్పందం కుదుర్చుకోగా ఇది రెండోది.. ఇప్పటికే ఇది విస్తృతమైన ట్రయల్స్ ని చేపట్టిందని అధికారి వెల్లడించారు.
కాగా, హుగ్లీ నది ఒడ్డున ఉన్న జిఆర్‌ఎస్‌ఇ మెయిన్ కాంప్లెక్స్ లో జులై 15న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నౌకను ప్రారంభిస్తారని జిఆర్‌ఎస్‌ఇ అధికారి శనివారం తెలిపారు. యుద్ధనౌక నిర్మాణం చివరి దశలో ఉందని, పెయింట్ షాప్ పనులు జరుగుతున్నాయన్నారు. అయితే.. GRSE నిర్మించిన మొదటి P17A యుద్ధనౌకను గత 2020 డిసెంబరు లో అప్పటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ భార్య మధులికా రావత్ ప్రారంభించారు.
P17A షిప్‌లు కంప్లీట్‌గా గైడెడ్- మిసైల్ యుద్ధనౌకలు. వీటిలో ప్రతి ఒక్కటి 149 మీటర్ల పొడవు, సుమారు 6,670 టన్నుల బరువు, 28 నాట్ల వేగంతో ఉంటాయని అధికారి తెలిపారు. కాగా, నేవీ ఏడు స్టెల్త్ ఫ్రిగేట్‌ల కోసం ఆర్డర్లు చేయగా.. వాటిలో 4 మజాగాన్ డాక్ లిమిటెడ్ (MDL)కి, మరో మూడు GRSEకి వెళ్లాయి.
ప్రాజెక్ట్ 17A కింద మూడు స్టెల్త్ ఫ్రిగేట్‌ల నిర్మాణానికి రూ. 19,294 కోట్ల కాంట్రాక్టు GRSEకి దక్కింది. ఇది అతిపెద్ద ఆర్డర్ అని తెలుస్తోంది. కోల్‌కతాకు చెందిన డిఫెన్స్ పిఎస్‌యు వద్ద ప్రస్తుతం రూ.24,000 కోట్ల ఆర్డర్ బుక్ అయి ఉంది. GRSEకి రాంచీలో డీజిల్ ఇంజిన్ ప్లాంట్, బెయిలీ వంతెన నిర్మాణం వంటి ఇతర కార్యకలాపాలు ఉన్నప్పటికీ, దాని ఆదాయంలో దాదాపు 95 శాతం షిప్‌బిల్డింగ్ నుండి వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఆరు ప్రాజెక్టులపై పనిచేస్తోందని, ఇందులో గయానాకు ఒక ప్యాసింజర్ షిప్, బంగ్లాదేశ్‌కు ఆరు పెట్రోలింగ్ ఓడలతోపాటు మరో 23 షిప్‌లు నిర్మాణంలో ఉన్నట్టు తెలుస్తోంది.