పారిస్ ఫ్యాషన్ వీక్ లో జరిగిన షోలో పాల్గొంది బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోను అప్లోడ్ చేసింది. ఇప్పుడా పోస్టు అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. లూయిస్ విటాన్ బ్రాండ్ కోసం దీపికా క్యాట్‌వాక్ చేసింది. సమ్మర్-స్ప్రింగ్ డ్రెస్సులో ఆమె తళుక్కుమంది. పారిస్ ష్యాషన్ వీక్‌లో భాగంగా జరిగిన షోలో దీపిక్ తన ట్రెండీ డ్రెస్సుతో అందర్నీ మెస్మరైజ్ చేసింది. లూయిస్ విటాన్ కంపెనీ తరపున గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా చేస్తున్న విషయం తెలిసిందే. మినీ బీగీ డ్రెస్సులో తెగ క్యూట్‌గా కనిపిస్తున్న దీపికా ఫోటోపై భర్త రణ్వీర్ సింగ్ కూడా కామెంట్ చేశారు. ఆ పోస్టుకు అతను హాట్ ఫీలింగ్ ఎమోజీని పోస్టు చేశాడు. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, జాన్వీ కపూర్లు కూడా దీపికా ఫోటోలకు లైక్‌లు కొట్టేశారు.దీపిక ఫొటో తెగ వైరల్ అవుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement