చైనా శాస్త్రవేత్తలు మరొక అసాధారణ ప్రమోగ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వకం పనుల్ని ప్రారంభించారు. ఈ ప్రయత్నం ద్వారా భూగర్భాన్వేషణలో మరో ముందడుగు పడిన్లటంది. ఈ రంధ్రం సుమారు 10,000 మీటర్ల (32,808 అడుగులు) లోతు ఉండొచ్చని అంచనా. చైనాలోని చమురు సమృద్ధి ప్రాంతమైన షింజియాంగ్‌లో ఈ తవ్వకాన్ని మొదలు పెట్టారు. ఈవిషయాన్ని చైనా ప్రభుత్వ అధికార మీడియా జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
జిన్హువా న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం భూమిలోకి ఇరుకైన షాప్ట్ 10 కంటే ఎక్కువ ఖండాంతర పొరలు లేదా రాతి పొరలను చీల్చుకుంటూ భూగర్భంలోకి చొచ్చుకుపోతుంది. భూభాగంలోని క్రేటేసియస్ పొరను ఆ హోల్ చేరుకుంటుందని భావిస్తున్నారు. అక్కడ సుమారు 145 మిలియన్ల క్రితం ఏర్పడిన రాళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. భూగర్భ పరిశోధనలు ఉదృతం చేయాలని ప్రఖ్యాత సైంటిస్టులను ఉద్దేశిస్తూ ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఖనిజాలతో పాటు వనరుల్ని కూడా గుర్తించాలని ఆయన తెలిపారు. ఈ డ్రిల్లింగ్ ప్రాజెక్టు అత్యంత కఠినమైంది. ఓ భారీ ట్రక్కును రెండు సన్నటి తీగలపై నడిపించినట్లు ఉంటుంది అని చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్త సున్ జింషెంగ్ పేర్కొన్నారు. ఇప్పటికే 2021లో భూగర్భ అన్వేషణను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందించారు. ఇవి ఖనిజ, ఇంధన వనరులను గుర్తించడంతోపాటు, భూకంపాలు, అగ్నిపర్వతాల ముప్పును ముందే పసిగట్టగలదని అన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత లోతైన మానవ నిర్మిత రంధ్రం రష్యాలో ఉంది. కోలా సూపర్ డీప్ బోర్‌హూల్‌గా దీనిని పిలుస్తుంటారు. దీనిలోతు 12,262 (40,230 అడుగులు) మీటర్లు… 20 ఏళ్లపాటు డ్రిల్లింగ్ చేయగా, 1989లో 12వేల మీటర్ల లోతుకు చేరుకొంది.
మరోవైపు అదే సమయంలో గోబి ఎడారినుంచి ముగ్గురు వ్యోమగాములను చైనా రోదసిలోకి పంపింది. వారిలో దేశ తొలి పౌర వ్యోమగామి గుయ్ #హచావో కూడా ఉన్నారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని తమఅంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించడం విశేషం. ఇది చైనా అంతరిక్ష కార్యక్రమంలో కీలక ముందడుగు. ముగ్గురు వ్యోమగాములు షెంజౌ-16 వ్యోమనౌకలో రోదసిలోకి పయనమయ్యారు. లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ దీన్ని మోసుకెళ్లింది. తద్వారా భూమి పైనా, లోపల ఒకేసారి పరిశోధనలను ముందుకు తీసుకెళ్లిన్లటంది.