Thursday, November 21, 2024

TG | రాష్ట్ర‌ వ్యాప్తంగా 29న దీక్షా దివస్.. కేటీఆర్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర‌ వ్యాప్తంగా ఈ నెల 29వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షాదివాస్ ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

తెలంగాణ‌ స్వరాష్ట్ర సాధనలో రాష్ట్ర ప్రజలకు ఇది అత్యంత కీలక ఘట్టంగా నిలుస్తుందని అన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి తెలంగాణ రాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందన్నారు.

ఈ దీక్ష యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించిందని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసిందని పేర్కొన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజలు చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని చెప్పారు. ఈ నెల 29న కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్‌లో కేటీఆర్ పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement