తెలంగాణలో గడచిన 24 గంటల్లో 39,579 శాంపిల్స్ పరీక్షించగా, 374 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 91 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 39, నల్గొండ జిల్లాలో 22 కేసులు నమోదయ్యియి. 683 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 7,87,437.. అయితే 7,78,850 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,477 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,110కి పెరిగింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..