దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 53,256 కేసులు నమోదు అయ్యాయి. అలాగే చికిత్స పొందుతూ మరో 1,422మంది కరోనా కారణంగా మృతి చెందారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో కొత్తగా కరోనా నుండి 78,190మంది కోలుకున్నారు.
తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. అలాగే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,88,44,199కి చేరింది. అలాగే మొత్తం దేశ వ్యాప్తంగా 3,88,135 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 7,02,887 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.