Friday, November 8, 2024

తగ్గిన ఎగుమతులు.. 6.58 శాతంగా నమోదు

మన దేశ ఎగుమతులు జనవరిలో 6.58 శాతం తగ్గాయి. గ్లోబల్‌ డిమాండ్‌ తగ్గడంతో ఎగుమతులు తగ్గి 32.91 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్య లోటు 12 నెలల కనిష్టానికి 17.75 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దిగుమతులు కూడా వరసగా రెండోనెలలోనూ తగ్గి జనవరిలో 3.63 శాతంగా నమోదయ్యాయి. దిగుమతుల విలువ 50.66 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2022-23 సంవత్సరం ఏప్రిల్‌-జనవరి మధ్య దేశ ఎగుమతులు 8.51 శాతం పెరిగి 369.25 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతులు 21.89 శాతం పెరిగి 602.20 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.


ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్‌-జనవరి మద్య కాలంలో సరకుల వాణిజ్య లోటు 233 బిలియన్‌ డాలర్లుగా ఉంది. డిసెంబర్‌ 2022లో దేశ ఎగుమతులు 12.2 శాతం తగ్గి 34.48 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. జనవరి, 2022లో వాణిజ్యలోటు 17.42 బిలియన్‌ డాలర్లుకు చేరింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 10 నెలల కాలంలో ఇంజినీరింగ్‌ గూడ్స్‌, ఐరన్‌ ఓర్‌, ప్లాస్టిక్‌, జెమ్స్‌ అండ్‌ జ్యువెల్లరీ ఎగుమతులు తగ్గాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement