Monday, November 25, 2024

ఆఫీస్‌ స్పేస్‌కు తగ్గిన డిమాండ్‌.. హైదరాబాద్‌లో పెరుగుదల

కోవిడ్‌ తరువాత దేశంలో ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. 2022లో చాలా వరకు వ్యవస్థలు కోలుకున్నాయి. ప్రపంచ వ్యప్తంగా ఆర్ధిక మాంద్యం వస్తుందన్న ఆందోళనతో టెక్నాలజీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వ్యయ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాయి. ఐటీ కంపెనీలతో పాటు, పలు అంతర్జాతీయ సంస్థలు ఇదే బాటలో నడుస్తున్నాయి. దీంతో మన దేశంలో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ భారీగా పడిపోయింది. ప్రముక రియల్‌ ఎస్టేట్‌ సేవల సంస్థ సవిల్స్‌ తాజా డేటా ప్రకారం దేశంలోని టాప్‌ 6 మార్కెట్లలో 2023 జనవరి- మార్చి త్రైమాసికంలో ఆఫీస్‌ స్పెస్‌కు డిమాండ్‌ 11 శాతం పడిపోయింది. ప్రధానంగా ముంబై, ఢిల్లి ఎన్‌సీఆర్‌, బెంగళూర్‌, పూణే, హైదరాబాద్‌, చెన్నయ్‌ నగరాల్లో డిమాండ్‌ తగ్గిపోయింది. 14 మిలియన్‌ చదరపు అడుగుల స్థలం అందుబాటులోఉంది. 2022 ఇదే కాలంతో పోల్చితే ఈ నగరాల్లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ 11 శాతం పడిపోయిందని సవిల్స్‌ పేర్కొంది.

ముంబైలో అత్యధికంగా 32 శాతం డిమాండ్‌ పడిపోయింది. బెంగళూర్‌లో 29 శాతం తగ్గుదల నమోదైంది. టాప్‌ మార్కెట్లలో ఢిల్లి ఎన్‌సీఆర్‌లో 26 శాతం, హైదరాబాద్‌లో 50 శాతం వృద్దిని నమోదు చేశాయి. ప్రముఖ కంపెనీలు ఆఫీస్‌ లీజింగ్‌ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో మార్కెట్‌లో ఆఫీస్‌ స్పేస్‌ల సరఫరా అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 31 శాతం తగ్గిపోయింది. జనవరి- మార్చిలో 13.1 మిలియన్‌ చదరపు అడుగుల కొత్త కార్యాలయాల స్పేస్‌ అందుబాటులోకి వచ్చింది. గత ఏడాదితో పోల్చితే ముంబైలో కొత్త ఆఫీస్‌ స్పేస్‌ 73 శాతం తగ్గింది. చైన్నయ్‌లో ఇది 52 శాతం తక్కువగా ఉంది. బెంగళూర్‌లో 43 శాతం తగ్గింది. కొత్త ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి వచ్చిన వాటిలో హైదరాబాద్‌ అత్యధికంగా పెరిగి 61 శాతం అదనంగా అందుబాటులోకి వచ్చింది.

జనవరి- మార్చి కాలంలో హైదరాబాద్‌ నగరంలో 3.7 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్నేస్‌ అందుబాటులోకి వచ్చింది. పూణేలో 3 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి వచ్చింది. ఆఫీస్‌ స్పేస్‌కు రానున్న కాలంలో కొంత మేర డిమాండ్‌ ఉండే అవకాశం ఉందని సావిల్స్‌ ఇండియా పేర్కొంది. ఈ కాలంలో ఖాళీల స్థాయిలు ఈ కాలంలో కొంత స్థిరంగా ఉన్నాయని, మార్చి త్రైమాసికంలో టాప్‌ మార్కెట్లలో మొత్తం ఖాళీగా ఉన్న ఆఫీస్‌ స్పేస్‌లు సంవత్సరం క్రితం 18.5 శాతం ఉంటే, ప్రస్తుతం 16.4 శాతంగా ఉన్నాయిన మరో సర్వీసెస్‌ సంస్థ కొలియర్స్‌ ఇండియా వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement