Friday, November 22, 2024

ప్రపంచ కుబేరుల సంపదలో తగ్గుదల.. 1.4 లక్షల కోట్ల డాలర్ల సంపద అవిరి

కోవిడ్‌ కాలంలో భారీగా సంపద పోగేసుకున్న కుబేరులకు 2022 అంతగా కలిసి వస్తున్నట్లు కనిపించడంలేదు. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పతనం అవుతుండడమే ఇందకు ప్రధాన కారణమని బ్లూం బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ అంటోంది. ఈ సంస్థ ప్రకారం ప్రపంచంలోని 500 మంది అత్యంత సంపన్నుల ఆస్తి మొత్తం 1.4 లక్షల కోట్ల డాలర్ల మేర తగ్గిపోయింది. స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమైన సోమవారం ఒక్క రోజే 20,600 కోట్ల డాలర్లు వీరు నష్టపోయారు.

అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను మరిం పెంచవచ్చన్న భయాలే స్టాక్‌ మార్కెట్ల పతనానికి కారణం. ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్‌ మాస్క్‌ ఈ సంవత్సరం 7,320 కోట్ల డాలర్ల సంపద కోల్పోయారు. అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ఆస్తి 6,530 కోట్ల డాలర్ల వరకు తగ్గిపోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement