Friday, November 22, 2024

డిసెంబర్‌ జీఎస్టీ వసూళ్లు రూ.1.29 లక్షల కోట్లు

జీఎస్టీ వసూళ్ల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఆరవ నెల డిసెంబర్‌ 2021లో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయి. డిసెంబర్‌ 2021లో జీఎస్టీ వసూళ్లు రూ.1.29 లక్షల కోట్లుగా నమోద య్యాయి. అంతక్రితం ఏడాది 2020 డిసెంబర్‌తో పోల్చితే వసూళ్లు 13 శాతం మేర పెరిగాయని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ మేరకు శనివారం రిపోర్ట్‌ విడుదలైంది. నవంబర్‌ 2021లో వసూళ్లు రూ.1.31 లక్షల కోట్లతో పోల్చితే తగ్గుదల నమోదయినా.. వరుసగా ఆరవ నెల లక్ష కోట్లు దాటడం విశేషం. డిసెంబర్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.29 లక్షల కోట్లు కాగా ఇందులో సీజీఎస్టీ రూ.22,578 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.28,658 కోట్లు, ఐజీఎస్టీ రూ.69,155 కోట్లు, ఇక సెస్‌ రూ.9,389 కోట్లుగా ఉన్నాయని ఆర్థిక శాఖ వివరించింది.

డిసెంబర్‌ 2021లో జీఎస్టీ ఆదాయం అంతక్రితం ఏడాదితో పోల్చితే 13 శాతం అధికం.. ఇక డిసెంబర్‌ 2019తో పోల్చితే 26 శాతం ఆదాయం అధికంగా ఉందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో రికవరీ, పన్ను ఎగవేత నిరోధక కార్యకలాపాలు, ముఖ్యంగా ఫేక్‌ బిల్లర్స్‌పై చర్యలు జీఎస్టీ వసూళ్లు పెరగడంలో దోహదపడ్డాయి. ఇన్వర్టెడ్‌ డ్యూటీ విధానాన్ని సరిదిద్దేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకున్న క్రమబద్దీకరణ చర్యల కారణంగా ఆదాయం మెరుగయిందని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆదాయంలో పాజిటివ్‌ ట్రెండ్‌ మున్ముందు కూడా కొనసాగనుందని ఆర్థిక శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement