మునుపెన్నడూ లేనివిధంగా మహిళా అంపైర్లను బీసీసీఐ నియమించింది. క్రికెట్ అంటే పురుషుల కోసమనే అభిప్రాయానికి తెరదించుతూ క్రీడారంగంలో గౌరవమైన హోదాలో చేరారు ముగ్గురు నారీమణులు. మహిళా క్రికెట్ ఇప్పటివరకు మహిళా అంపైర్లు లేరు. కానీ బీసీసీఐ ఒక అడుగు ముందుకేసి ముగ్గురు అంపైర్లను నియమించారు. వారే వృందారాఠి, జనని నారాయణన్ , గాయత్రివేణుగోపాలన్ మహిళా అంపైర్లుగా మారి కొత్త రికార్డును నమోదు చేశారు. ప్రస్తుతం రంజీ మ్యాచుల్లో ఈ ముగ్గురు అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. జార్ఖండ్, చత్తీస్‌గడ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గాయత్రి, రైల్వేస్, త్రిపురల మధ్య పోరులో జనని, గోవా, పాండిచ్చేరి మ్యాచ్‌లో వృందా అంపైర్లుగా బాధ్యతలు ప్రారంభించారు. సాప్ట్ వేర్ ఉద్యోగిని అయిన జననికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. తాను అంపైర్ కావాలనుకుంటున్నట్లు తమిళనాడు క్రికెట్ సంఘంకు పలు మార్లు విజ్ఞప్తి చేసింది. కొన్నేళ్ల తర్వాత టీఎస్‌సీఏ నిబంధనలను మార్చి మహిళలకు అవకాశం కల్పించింది.
2018లో బీసీసీఐ లెవెల్ -2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన జనని. 2021లో తమిళనాడు ప్రిమియర్ లీగ్‌లో అంపైర్లుగా విధులు నిర్వర్తించింది. ముంబై మైదానాల్లో స్థానిక మ్యాచ్‌లకు స్కోరర్‌గా వ్యవహరించిన వృందా.. 2013 మహిళల ప్రపంచకప్‌లో బీసీసీఐ స్కోరర్‌గా పనిచేసింది. అనంతరం అంపైరింగ్‌కు మారింది. క్రికెట్‌కు కావాలనుకున్న గాయత్రి.. భుజం గాయం కారణంగా నిర్ణయం మార్చుకుంది. 2019లో బీసీసీఐ అంపైర్‌గా తన కెరీర్ మొదలు పెట్టింది. ఇక ప్రపంచంలోనే మొట్ట మొదటి మహిళా అంపైర్‌గా క్లైర్ చరిత్ర కెక్కారు. ఆస్ట్రేలియా క్రీడాకారిణి అయిన ఈమె పురుషుల టెస్ట్ మ్యాచ్‌లో తొలి మహిళా అంపైర్ అవతారము ఎత్తారు. పోలోసాక్ సిడ్నీ టెస్టుల్లో నాల్గవ అంపైర్ పాత్రను చేపట్టింది.