రాష్ట్రంలోని రైతులందరికీ రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం హామినిచ్చిన నేపథ్యంలో ఈ సారి బడ్జెట్లో అందుకు పెద్దపీట వేసింది. రూ.50వేల లోపు రుణాలు ఈ మార్చి లోపు మాఫీ అవనున్నాయి. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి రూ.75వేల లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది.
ఇందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడంతో పాటు ఈ సారి రుణమాఫీ కోసం రూ.2,999.20కోట్లను కేటాయించింది. రూ.50 వేల నుంచి రూ.75 వేల లోపు రైతులకు మాఫీ చేయనుంది ప్రభుత్వం. 7లక్షల మంది ఉండగా, వీరి రుణమాఫీ కోసం రూ.4వేల కోట్లు అవసరం పడనున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..