తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజు విరామం తర్వాత రేపు (శనివారం) తిరిగి సమావేశం కానుంది. నిన్న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దానిపై సభ్యులు అధ్యయనం చేసి రేపటి సభలో చర్చలో పాల్గొనేందుకు శుక్రవారం సెలవు ఇచ్చారు. శనివారం ఉదయం 10గంటలకు శాసనసభ, శాసన మండలి సమావేశం కానున్నాయి.
ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, నేరుగా బడ్జెట్ పద్దుపై చర్చకు అవకాశం కల్పించారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి ఉభయ సభల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇస్తారు. మొదట శాసనసభలో సమాధానం ఇచ్చిన తర్వాత, మండలిలోనూ డిప్యూటీసీఎం సమాధానమిస్తారు.