Wednesday, November 20, 2024

చైనాలో మరణమృదంగం.. వారం రోజుల్లోనే 13 వేల కొవిడ్‌ మరణాలు

చైనాలో కరోనా ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చింది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా భారీ ఎత్తున సంభవిస్తున్నాయి. దేశంలో కొవిడ్‌ బారిన పడిన వారు దాదాపు 80 శాతం మంది ఉన్నారు. ఈ క్రమంలోనే వారం వ్యవధిలోనే దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో దాదాపు 13 వేల వరకు కొవిడ్‌ మరణాలు నమోదైయాయని చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) వెల్లడించింది. కొవిడ్‌తో పాటు ఇతర వ్యాధుల తీవ్రత కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది.

అయితే ఇది ఆస్పత్రుల్లో మరణించిన వారి సంఖ్య. వైరస్‌ బారినపడి ఇళ్ల వద్దే మరణించిన వారి సంఖ్య ఇంకా అధికంగా ఉంది. జీరో కొవిడ్‌ ఎత్తేసిన నెల రోజుల్లోనే దాదాపు 60 వేలకు పైగా కొవిడ్‌ మరణాలు నమోదు అయినట్టు చైనా అంతకు ముందు వెల్లడించింది. మరోవైపు చైనాలో నూతన సంవత్సర వేడుకల సెలవుల వేళ దేశవ్యాప్తంగా కోట్లాది మంది చైనీయులు ఒక ప్రాంతం నుంచి మరోక ప్రాంతానికి ప్రయాణాలు చేస్తుందటంతో వైరస్‌ ఇంకా ప్రబలే అవకాశముందని ప్రభుత్వ ఆందోళన చెందుతుంది. రానున్న రోజుల్లో చైనాలో కొవిడ్‌ మరణాలు మరింతగా సంభవించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement