చండీగడ్ – పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను రిపబ్లిక్ డే రోజున హతమారుస్తామని ఖలిస్థాన్ ఉగ్రవాది హెచ్చరించారు. సీఎంతో పాటు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్‌కు కూడా ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. ఆ దాడికి గ్యాంగ్‌స్టర్లు ఏకం కావాలని గుర్‌పత్వంత్ సింగ్ పన్నూన్ పిలుపు ఇచ్చాడు.. కాగా, పన్నూన్ బెదిరింపులు నిజమేనని పంజాబ్ పోలీసు అధికారి ఒకరు ధృవీకరించారు . గ్యాంగ్ స్టర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. పన్నూన్ బెదిరించిన వెంటనే డీజీపీ గౌరవ్ స్పందించారు. గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
గుర్ పత్వంత్ సింగ్ పన్నూన్ సిక్కు ఫర్ జస్టిస్ ఏర్పాటు చేశాడు. గతంలో భారతీయ అధికారులను బెదిరించాడు. డిసెంబర్ 13వ తేదీ, అంతకన్నా ముందు భారత పార్లమెంట్‌పై దాడి చేస్తానని వీడియో కూడా విడుదల చేశారు. అంతకుముందు ఓ వీడియో రిలీజ్ చేశారు. నవంబర్ 19వ తేదీన ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని బెదిరించారు. ఆ వీడియోపై జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది.