Friday, November 22, 2024

Death Sentence – చిన్నారి రేప్ – దోషికి మ‌ర‌ణ‌శిక్ష‌….

కేర‌ళ‌లోని అలువ‌లో జ‌రిగిన చిన్నారి కిడ్నాప్‌, రేప్ కేసులో దోషి అష్‌ఫ‌క్ ఆల‌మ్ కు ఎర్నాకుళం పోక్సో కోర్టు మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించింది. ఆ కేసులో జ‌డ్జి కే సోమ‌న్ త‌న తీర్పును ఇవాళ వెలువ‌రించారు. ప్రాసిక్యూష‌న్ చేసిన వాద‌న‌ల‌ను కోర్టు అంగీక‌రించింది. ఇది అత్యంత అరుదైన కేసు అని, నిందితుడికి ఎటువంటి క్ష‌మ అవ‌స‌రం లేద‌ని, స‌మాజానికి అత‌నో స‌మ‌స్య అని కోర్టు తెలిపింది. 110 రోజుల పాటు ఆ కేసులో సుదీర్ఘ వాద‌న‌లు జ‌రిగాయి. చిల్డ్ర‌న్స్ డే సంద‌ర్భంగా తీర్పును వెల్ల‌డించారు. ఈ తీర్పు ప‌ట్ల ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement