30కోట్లు ఇవ్వండి.. లేకపోతే చంపేస్తామంటూ ముఖేష్ అంబానీకి డెత్ మెయిల్ అందింది. గుర్తు తెలియని వ్యక్తులు షూట్ చేసి చంపుతామంటూ ఈ మెయిల్ పంపించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆధీనంలో నడుస్తోన్న ఆసుపత్రికి బెదిరింపు ఫోన్ కాల్ అందిన కొద్దిరోజుల్లోనే ముఖేష్ అంబానీకి డెత్ మెయిల్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రెండు ఘటనలు ముంబైలో కలకలం రేపాయి. పోలీసులు ఆయన నివాసానికి అదనపు భద్రతను కల్పించారు.
ఇదివరకూ ముఖేష్ అంబానీకి బెదిరింపులు అందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ అజ్ఞాత వ్యక్తుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆయనకు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. తాము అడిగిన 20 కోట్ల రూపాయలను ఇవ్వకపోతే షూట్ చేసి చంపుతామంటూ అజ్ఞాత వ్యక్తులు ముఖేష్ అంబానీకి ఇ-మెయిల్ పంపించారు.దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గమ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 387, 506 (2) కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ తెలిపారు.