గత ఏడాది డిసెంబర్ 27న పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. చలాన్ల చెల్లింపునకు జనవరి 10 వరకు గడువు ఇవ్వగా.. ఆ తర్వాత గడువును జనవరి 31 వరకు పొడిగించింది. అనంతరం ముచ్చటగా మూడోసారి ఫిబ్రవరి 15వ తేదీవరకు పొడిగిస్తూ అధికారులు ప్రకటించారు. దీంతో సబ్సిడీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు నేటి అర్ధరాత్రితో ముగియనుంది.
పెండింగ్‌లో ఉన్న వాహనాల చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి గడువు పొడిగించేది లేదని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. పెండింగ్‌లో ఉన్న చలాన్‌ల చెల్లింపు గడువు నేటి అర్ధరాత్రి 11:59 గంటలతో ముగుస్తుంది.
గత ఏడాది డిసెంబర్ 26 నుంచి పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ప్రభుత్వం రాయితీని కల్పించింది. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు గడువును పొడిగించింది. ఇకపై గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలతో పాటు త్రీ వీలర్లపై 80 శాతం తగ్గింపును ప్రకటించింది. కార్లతో పాటు ఇతర వాహనాలకు 60 శాతం తగ్గింపును ప్రకటించింది. ఆర్టీసీ బస్సులపై ప్రభుత్వం 90 శాతం రాయితీ కల్పించిన విషయం తెలిసిందే.