తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2023కి ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఏప్రిల్ 10వ తేదీ లోపు లేట్ ఫీ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు ఏప్రిల్ 12, 14 తేదీల మధ్య https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ డేటాను సరి చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
విద్యార్థులు రూ.250, రూ.500 ఫీజుతో ఏప్రిల్ 15, 20వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2,500, రూ.5,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 2వ తేదీ మద్య దరఖాస్తు చేసుకోవచ్చు.. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న హాల్ టికెట్లను విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TS EAMCET మే 10, 11వ తేదీలలో, ఇంజనీరింగ్ పరీక్ష మే 12, 13, 14వ తేదీలలో జరుగుతుంది.