Tuesday, November 26, 2024

ఈ నెల 28 వరకు విమాన సంస్థలకు గడువు.. లోపాలు సరిచేసుకోవాలన్న డీజీసీఏ

ఇటీవల వరసగా విమానాల్లో సాంకేతి సమస్యలు తలెత్తున్నాయి. చాలా సార్లు ఆయా విమానాలను అర్ధంతరంగా ల్యాండింగ్‌ చేయిస్తున్నారు. దీనిపై స్పందించిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అన్ని విమానయాన సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28 లోగా లోపాలను సరి చేసుకోవాలని, తగినంత మంది సిబ్బందిని సమకూర్చుకోవాలని ఆదేశించింది. విమానాలు ఎగరడానికి ముందు అన్ని అంశాలను క్షుణంగా పరిశీలించాల్సి ఉంటుంది. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో ఈ పని సం పూర్ణంగా జరగడంలేదని డిజీసీఏ గుర్తించింది. తనిఖీలు చేసిన తరువాత విమానం ప్రయాణానికి అనువుగా ఉం దని నిపుణులు సర్టిఫై చేయాల్సి ఉంటుంది.

మినిమమ్‌ ఎక్యూప్‌మెంట్‌ లిస్ట్ (ఎంఈఎల్‌) కింద విమానాలను ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. క్లిష్టమైన కంపోనెట్స్‌ను సరిగా రిపేర్‌ చేయకపోవడం వల్లే తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పేర్కొంది. గుర్తించిన అన్ని సమస్యలను ఈ నెల 28 లోగా పరిష్కరించుకోవాలని డీజీసీఐ అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ విషయంలో విఫలమైతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement