మధ్యాహ్న భోజన పథకం తిని 80మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కర్నాటక రాష్ట్రంలోని హవేరి జిల్లాలో విద్యార్దులకు వడ్డించిన మధ్యాహ్న భోజనంలో బల్లి వచ్చింది. బల్లి ఉన్న భోజనాన్ని తిన్న 80మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంకటాపుర తండాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్‌లో బల్లి ఉన్న భోజనం తిన్న 80మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురికావటంతో వారిని హుటాహుటిన రాణిబెన్నూరు పట్టణంలో ఉన్న ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. చికిత్స అయ్యాక పిల్లలు కోలుకోవడంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలంతా బాగానే ఉన్నామని వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసామని స్కూల్ అధికారులు తెలిపారు. కానీ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఎవ్వరికి ఏమీ జరగలేదు..కానీ ఏమన్నా జరగరానిది జరిగితే బాథ్యత ఎవరిదని, ఇలాంటి ఘటనలు మరోసారి జరుగకూడదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం అధికారుల్ని ఆదేశించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital