డీ-మైన్ చేయబడిన కోల్ ల్యాండ్‌ను లీజుకు ఇచ్చి కోల్, ఎనర్జీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుతం అవకాశం కల్పించనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి వర్గం కూడా ఆమోదముద్ర వేసింది. కోల్ ఇండియా వంటి ప్రభుత రంగ బొగ్గు కంపెనీల నుంచి డీ-కోల్ భూమిని ప్రైవేటు రంగానికి లీజుకు ఇవ్వడానికి అవకాశం కల్పించాలని మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మొదటి విడతలో.. ఇటువంటి కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా పెద్ద ఎత్తున భూములు అందు బాటులో ఉన్నట్టు తెలుస్తున్నది. 3200 హెక్టార్లకు పైగా ఈ తరహా భూమి ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. యాజమాన్య హక్కుల్లో మార్పు చేయకుండా.. బొగ్గు ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధికి.. సీపీఎస్‌యూలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలకు పీఎస్‌యూలు, బొగ్గు కంపెనీలకు భూమి లీజును మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదన పరిశీలించి క్లియర్ చేసిందని సమా చారం. భారతదేశంలోని అతిపెద్ద బొగ్గు గనుల సంస్థ కోల్ ఇండియా ప్రకారం.. బొగ్గు బేరింగ్ ప్రాంతాల చట్టం 1957 ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఇప్పటికే అర్హతగల జాబితాలో ఉన్నట్టు సమాచారం. 1973లో ఈ రంగాన్ని జాతీయం చేశారు.
కోల్ మైనింగ్ ఏరియాల్లో ఎక్కువ భాగం అన్‌లాక్ చేయబడి ఉందని బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో పవర్ ప్లాంట్లు కలిగి ఉన్న ప్రైవేటు కంపెనీలు.. ప్లాంట్ కోసం కన్వేయర్ బెల్టులు, కోల్ వాషింగ్ వంటి సెకండరీ సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేబినెట్ ఆమోదంతో.. ప్రైవేటు కంపెనీలు సౌకర్యాలను ఏర్పాటు చేయలేరు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..