Saturday, June 29, 2024

ENG vs SA | హాఫ్ సెంచ‌రీతో ఆదుకున్న డికాక్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎతంటే

టీ20 ప్ర‌పంచ క‌ప్ సూప‌ర్ 8 లో భాగంగా నేటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఇంగ్లండ్ ముందు మోస్తరు టార్గెట్ సెట్ చేసింది. సెయింట్ లూయిస్ వేదిక‌గా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా… నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగుల సాధించింది.

ఓపెనర్ క్వింట‌న్ డికాక్(53) సిక్స‌ర్ల‌తో హోరెత్తించాడు. మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (43) రాణించాడు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (19), ట్రిస్టన్ స్టబ్స్ (12 నాటౌట్) పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో చెలరేగాడు.. మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ చెరో వికెట్ దక్కించుకున్నారు. దీంతో 164 పరుగుల టార్గెట్‌తో ఇంగ్లండ్ జట్టు చేజింగ్‌కు దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement