Tuesday, September 17, 2024

TG | ఏసీబీ వలలో ట్రాన్స్ కో డీఈ

స్టేషన్ ఘనపూర్ మండలకేంద్రంలోని కుంభం ఎల్లయ్య అనే రైతు తన వ్యవసాయ భూమిలోని 33 కేవీ విద్యుత్తు లైన్ మార్చడానికి డీఈ (డివిజనల్ ఇంజనీర్) హుస్సేన్‌ నాయక్ రూ.20వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఎల్లయ్య కుమారుడు రాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

పక్కా ప్రణాళికతో (శనివారం) స్థానిక డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్ కార్యాలయంలో రాజు నుంచి రూ.20వేల లంచం తీసుకుంటుండ‌గా.. అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇన్స్పెక్టర్లు ఎస్. రాజు, ఎల్. రాజు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064కు టోల్ ఫ్రీ కి సంప్రదించవచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement