నిజామాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్యులను, ఉన్నతాధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. బడాపహాడ్ వెళ్తుండగా చందూర్ శివారులో మానాలకు చెందిన భక్తులతో వెళ్తున్న డిసిఎం బోల్తాపడి సుమారు 30 మంది గాయపడ్డారు. వారు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాద ఘటన విషయం తెలిసిన వెంటనే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్షత గాత్రులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. ప్రమాదం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని.. ధైర్యంగా ఉండండి మేము అండగా ఉంటామని బాధితులకు మంత్రి భరోసా కల్పించారు.