Saturday, November 23, 2024

మోడెర్నా వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి మంజూరు చేసిన భారత్

భారత్‌లో మ‌రో క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ వ‌స్తోంది. అమెరికా కంపెనీ మోడెర్నా త‌యారు చేసిన వ్యాక్సిన్ దిగుమ‌తి, అత్య‌వ‌స‌ర వినియోగానికి మంగ‌ళ‌వారం డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ముంబైలోని ఫార్మాసూటిక‌ల్ కంపెనీ సిప్లా ఈ వ్యాక్సిన్‌ను ఇండియాకు దిగుమ‌తి చేసుకోనుంది. సోమ‌వార‌మే ఈ సంస్థ దీనికోసం డీసీజీఐ అనుమ‌తి కోరుతూ ద‌ర‌ఖాస్తు చేసుకుంది. మోడెర్నా అనేది మెసెంజ‌ర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) వ్యాక్సిన్‌. ఇది కరోనాపై 90 శాతం స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న‌ట్లు తేలింది. ఇండియాలో క‌రోనా వైర‌స్ కోసం అత్య‌వ‌స‌ర అనుమ‌తి పొందిన నాలుగో వ్యాక్సిన్ మోడెర్నా. ఇప్ప‌టికే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్ వీల‌కు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే.

ఇది కూడా చదవండి: కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై ఈయూ ప్రకటన

Advertisement

తాజా వార్తలు

Advertisement