Thursday, November 21, 2024

వడ్డీ రేట్లు పెంచిన డీసీబీ..

న్యూఢిల్లి : రెపో రేటు పెంపు తరువాత.. బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో.. మరో ప్రైవేటు బ్యాంక్‌ డీసీబీ తన వడ్డీ రేట్లలో కీలక మార్పులు చేసింది. మే 21, 2022 నుంచి రూ.2కోట్ల కంటే తక్కువగా ఉన్న రెసిడెంట్‌ ఇండియన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును బ్యాంక్‌ సవరించింది. గతంలో బ్యాంక్‌ 7 నుంచి 90 రోజుల్లో ఎఫ్‌డీలపై 4.35 శాతం వడ్డీ ఆఫర్‌ చేసింది. దీన్ని 45 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.80 శాతానికి పెంచింది. 91 రోజుల నుంచి 6 నెలల్లోపు ఎఫ్‌డీలపై 5.50 శాతానికి పెంచింది.

6 – 12 నెలల్లోపు ఎఫ్‌డీలపై 45 బేసిస్‌ పాయింంట్లు 5.25 శాతం నుంచి 5.70 శాతానికి పెంచింది. 18 నుంచి 35 నెలల కంటే తక్కువ ఎఫ్‌డీలపై 6.50 శాతం వడ్డీ అందిస్తున్నది. 36-120 నెలల్లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.60 శాతానికి పెంచింది. సీనియర్‌ సిటిజన్‌లకు అన్ని కాల వ్యవధులు ఉండే డిపాజిట్లపై సాధారణ రేటు కంటే 0.50 శాతం అదనపు ప్రయోజనాన్ని బ్యాంక్‌ కొనసాగిస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement