Monday, November 18, 2024

DC vs SRH | సన్‌రైజర్స్ ఊచకోత.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్

అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టు మరో భారీ స్కోర్ చేసింది. ఎస్‌ఆర్‌‌హెచ్ బ్యాటర్లు ఢిల్లీ బౌలర్ల పై విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టాని 266 పరుగులు చేసింది. అయితే ఈ సీజన్‌లో సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మూడోసారి 250కి పైగా పరుగులు సాధించడం విషేశం.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టుకు ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్ (89), అభిషేక్ శ‌ర్మ‌(46) మంచి ఆరంభం అంధించారు. ఢిల్లీ బౌలర్లును ఉతికారేస్తూ.. 6 ఓవర్లలోనే 125 ర‌న్స్ సాధించారు. హెడ్ కేవ‌లం 16 బంతుల్లోనే అర్థ శ‌త‌కం న‌మోదు చేశాడు. అభిషేక్ సైతం ధాటిగా ఆడుతూ 12 బంతుల్లో 46 పరుగులకు ఔటయ్యాడు.

ఇక ఆ తరువాత వచ్చిన ష‌హ్‌బాజ్ అహ్మ‌ద్ (59)తో హాఫ్​ సెంచరీ బాడాడు. ఒక నితీశ్ రెడ్డి(37), అబ్దుల్ సమద్ (13), హెన్రిచ్ క్లాసెన్ (15) ఆకట్టుకున్నారు.దీంతో ఎస్‌ఆర్‌‌హెచ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టాని 266 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ బౌల‌ర్లో కుల్దీప్ యాద‌వ్ త‌న స్పిన్ మాయాజాలంతో నాలుగు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టగా.. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో వికెట్ ద‌క్కించుకున్నారు. ఇక ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు 267 ప‌రుగుల టార్గెట్ తో ఛేజింగ్ కు దిగ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement